ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు.. సీఎం జగన్ రెడ్డిపై ద్వజమెత్తిన చొప్పా చంద్రశేఖర్

అనంతపురం: జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి చొప్పా. చంద్రశేఖర్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నందు జరిగినటువంటి కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోతల రాయుడు వలే ఒక తుపాకి రాముడు మాటలవలే ప్రసంగించారు. ఆ పెద్దమనిషి రైతులకు వేల వేల కోట్లు ఇచ్చి ఆదుకుంటున్నామని అబద్ధపు మాటలు పలకడం జరిగింది. ఆయన చెప్పిన లెక్కలలోనే డొల్లతనం బయటపడింది ఒక సంవత్సరంలో పదిలక్షల 20వేల మంది రైతులకు ఇస్తే నాలుగు సంవత్సరాలలో 54 లక్షల మందికి ఏ విధంగా ఇచ్చినట్లు అని అడగాలి. దాదాపు ఈ ప్రసంగంలోనే 50 వేల కోట్ల వరకు రైతులకు ఇచ్చినట్లు జగన్ గారు రైతులందరినీ కోటీశ్వరులను చేసినంతగా అపద్దపు మాటలు పలకడం రైతులందరూ బిక్కుబిక్కుమని తెల్ల మొఖం వేసుకుంటున్నారు. రైతులందరికీ ఇన్ని వేల కోట్లు ఇస్తే మనం రైతులం ఎందుకు పంటలు గాని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే రైతుల పేరు చెప్పి ఎవరో కొన్ని వేల కోట్లు దోచేస్తున్నారన్నమాట… సింగనమల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వివిధ పంటలు వరి, అరటి, బొప్పాయి వర్షాలతో నేలమట్టం ఒరిగితే కేవలం చీనీ రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇచ్చినంత మాత్రాన రైతులందరికీ న్యాయం చేసినాను అనీ అనడం ఎంతవరకు సబబు వేరుశెనగ, కంది వంటి పంటలు పండించేవారు రైతులు కాదా అని రైతుల తరఫున జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది.. ఈ ముఖ్యమంత్రి గారు అతని నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క రైతుకైనా ఒక్క మీటరు డ్రిప్ పైపు గాని. ఇతర వ్యవసాయ పనిముట్లుగానే ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాపాన పోయిందా… అని జనసేన పార్టీ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం ఇలాంటి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తూ ప్రకృతి వనరులైన ఇసుక. కొండ గుట్టలను దోచుకొంటూ.. లిక్కర్ మాఫియా తో ప్రజల ఆరోగ్యాలను నాశనం.. చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువతను గంజాయి వైపు మళ్ళించి ..వారి భవిష్యత్తును నాశనం చేస్తూ అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్న ఈ దోపిడీ పాలనను ఎత్తి చూపిస్తే మా జనసేన అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తూలనాడడం.. కుటుంబ వ్యక్తులను దుర్భాషలాడడం.. ఏకంగా జగన్ గారే.. మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ద్వందార్థ పదాలతో పిలవడం వీరి విజ్ఞతను ప్రజలు గమనిస్తున్నారు.. మీ కాకమ్మ కబుర్లు నమ్మి పోయింది చాలు. ఇక మిమ్ములను ఇంటికి సాగనంపక తప్పదు. ఇదే ప్రజల మాట.. ఇదే ప్రజల ఆలోచన.. తొందరలోనే మీకు తగిన గుణపాఠం ప్రజలు చేస్తారు,
జనం బాగుండాలంటే జనసేన రావాలని.. నీతి నిజాయితీపరుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే నే మా భవిష్యత్తు బాగుంటుంది అని ప్రజల ఆలోచిస్తున్నారని చంద్రశేఖర్ తెలిపారు.