ప్రభుత్వానికి పట్టని ప్రజల ఆరోగ్యం

మదనపల్లి, పట్టణంలో 2 లక్షల 30 వేల వరకు జనాభా ఉండగా వీరికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామారావు కాలనీలోని కేంద్రానికి మాత్రమే సొంత భవనం ఉండగా మిగిలినవన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అన్నింటిలోనూ సూపర్వైజర్ ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతిరోజు ఒక్కో కేంద్రానికి 40 నుండి 50 మంది రోగులు వైద్య సేవ నిమిత్తం వస్తుంటారు రామారావు కాలనీ కేంద్రంలో మాత్రమే మందులు అందుబాటులో ఉండగా మిగిలిన కేంద్రాల్లో రక్త పోటు మాత్రలు మధుమేహ వ్యాధికి వినియోగించే గ్లిమిప్రైడ్ 2 ఎంజీ మాత్రలు అందుబాటులో లేవు. దీనిపై పట్టణ ఆరోగ్య కేంద్రాల జిల్లా మోడల్ అధికారి డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పరిస్థితిలో మాత్రం నేటి వరకు మార్పు లేదు. రాజంపేట పరిధిలో ఉస్మాన్ నగర్లో అద్దె భవనంలో నడుస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కొత్తగా వైద్య పరికరాలు వచ్చినా వాటిని బిగించడానికి నిధులు సమస్య నెలకొంది గత నాలుగు నెలలుగా అద్దె విద్యుత్తు చార్జీల సైతం చెల్లించలేని దయనీయస్థితిలో ఉంది. ఈ విధంగా పేరుకే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో సరైన మందులు గాని సిబ్బంది గాని పరికరాలు కానీ లేకపోవడం అనేది ప్రజల యొక్క ఆరోగ్యం పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని వెంటనే ప్రజలకు అందుబాటులో వైద్యులను వైద్యాన్ని ఉంచాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జనసేన పార్టి జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.