జనసైనికులు సమైక్యంగా శ్రమించాలి: బత్తుల

రాజానగరం, “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” 67వ రోజులో భాగంగా “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం హల సింగర్ పేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సామాజిక లక్ష్యాలు వివరిస్తూ, వైసీపీ అరాచక ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ, జనసేన ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు, భావితరాలకు జరగబోయే మంచిని వివరిస్తూ, ప్రజాదరణతో ముందుకు సాగింది. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ జనసైనికులు అందరూ క్రమశిక్షణతో సమైక్యంగా శ్రమించి, జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు, కోరుకొండ మండల జనసేన నాయకులు, హాల సింగర్ పేట జనసైనికులు పాల్గొన్నారు.