తిరువూరులో అంగన్వాడీల దీక్షకు సంఘీభావం తెలిపిన జనసైనికులు

తిరువూరు: స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద గతఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీల దీక్షకు మద్దతుగా మంగళవారం మద్దతు ప్రకటించిన తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, టౌన్ నాయకులు ఉయ్యూరు జయప్రకాష్, లింగినేని సుధాకర్, మరియు నాలుగు మండలాల అధ్యక్షులు మండల కార్యవర్గ సభ్యులు జనసైనికులు.. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ అంగన్వాడీలు కోరుతున్నటువంటి న్యాయపరమైన డిమాండ్లను, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం చెల్లించాలనే డిమాండ్లకు జనసేన పార్టీ మద్దతునిస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అంగన్వాడీల సమస్యలు పవన్ కళ్యాణ్ అన్నట్లు మానవతా దృక్పథంతో పరిశీలించాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అధికారం చేతిలో ఉందని సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలకొట్టి మరీ స్వాధీనం చేసుకోవటాన్ని ఈ సందర్భంగా వీరు ఖండించారు. భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త ప్రజా ప్రభుత్వంలో అంగన్వాడిల డిమాండ్లను కచ్చితంగా నెరవేర్చి విధంగా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా వారు అంగన్వాడీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరువూరు మండలాధ్యక్షుడు పరసా పుల్లారావు, పసుపులేటి రవీంద్ర బత్తుల వెంకటేశ్వరరావు, గంపలగూడెం మండల ప్రధాన కార్యదర్శులు వట్టికొండ కృష్ణ, జరపల రామకృష్ణ, పసుపులేటి మాధవరావు, దండేల తిరుపతిరావు, సూరం శెట్టి రామయ్య, బర్ల బాలకృష్ణ, భూక్య శివ, భూక్య సాయి మణికంఠ, తరుణ్ నాయుడు, కస్తాల మహేష్, ఫిరోజ్, రెబ్బు ఫణి, పల్లెపాటి రవి, తదితర జనసైనికులు పాల్గొన్నారు.