పందులు, పాములు, మురుగుతో ఇబ్బంది పడుతున్న శ్రామిక నగర్ ప్రజలను ఆదుకోండి

  • శ్రామిక నగర్ లో పర్యటించిన గునుకుల కిషోర్

నెల్లూరు: పందులు పాములు మరుగుతో ఇబ్బంది పడుతున్న శ్రామిక నగర్ ప్రజలను ఆదుకోండి అంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ శ్రామిక నగర్ లో ఆద్వారం స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాంత ఏర్పడి 20 సంవత్సరాలు దాటిన మౌలిక వసతులు కల్పనలో కార్పొరేషన్ విఫలమైంది. ఎన్నికల అప్పుడు కనబడే నాయకులు తమ సమస్యల సాధన కు కనపడట్లేదని స్థానికులు బాధపడుతున్నారు. మంచి నీటీకై ట్యాంక్ కట్టి సంవత్సరం అవుతున్నా కూడా దానికి కనెక్షన్ ఇవ్వక నీటి కొరత తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి పరిసరాల్లో చెత్త, మరుగు పడి దుర్గందం వెదజల్లుతోంది. పరిసరాలు అన్ని చెత్తా, చెదారంతో నిండిపోయి పందులు దోమలు విపరీతంగా సంచరిస్తున్నాయి. రోడ్ల నిర్మాణం లేక మట్టి రోడ్లు గుంతలపడి పాదచరులకు సైతం ఇబ్బంది కలిగే విధంగా ఉన్నాయి. గెలిచిన నాయకులు ఎవరూ తమను పట్టించుకోవట్లేదు అని స్థానికులు తమ బాదలను వెలిబుచ్చారు. స్థానిక సమస్యలను దృష్టికి తీసుకెళ్లి మౌలిక వస్తువులు కల్పనకు తమ వంతు ప్రయత్నం చేసి ప్రజలకు అండగా ఉంటామని తెలిపాము. ఈ కార్యక్రమం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ తో పాటు కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కార్పొరేషన్ కార్యదర్శి కృష్ణవేణి, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.