పోలవరం నియోజకవర్గం జనసేనలో భారీ చేరికలు

పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలంలోని ప్రగడపల్లి గ్రామంలో జనసేన పార్టీలోకి వివిధ పార్టీలలోని 25మంది ముఖ్యనాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం తిసుకోవడం జరిగింది. వీరిని సాదరంగా జనసేన పార్టీలోకి ముఖ్యనాయకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కరటం సాయి, జిల్లా నాయకులు గెడ్డమనుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు మరియు జిల్లా, మండల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.