జగనన్న ఇళ్ళ స్థలాలు పరిశీలించిన రాజమండ్రి రూరల్ జనసేన

రాజమండ్రి రూరల్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా #FailureOfJaganannaColony అనే హ్యాష్ ట్యాగ్ తో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే ఈ కార్యక్రమంలో భాగంగా సాటిలైట్ సిటీ, హుకుంపేట, కొంతమూరు, తదితర గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం సేకరించిన 40 ఎకరాల భూమిని జగన్ అన్న కాలనీ పేరుతో ఇవ్వవలసిన ఇండ్ల స్థలాలు ఇప్పటికి అభివృద్ధికి నోచుకోకుండా కనీసం ప్లాటింగ్ కూడా చెయ్యకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైసీపి అధికార పార్టీ ఈ ఇండ్ల స్థలాలు ప్రజలకు అందేవరకు జనసేన పార్టీ నిరంతర నిర్విరామ కృషి చేస్తోంది. ఈ కార్యాచరణ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ వారి ఆదేశాల నిమిత్తం శనివారం తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి షేక్ అమీన, మండల ఉపాధ్యక్షుడు సలీమ్, పంతం పట్టాభి, సయ్యద్ నాగూర్, శోభన్ బాబు, పిన్నమరెడ్డి రామరాజు, అత్తిలి వెంకట రమణ, మేకా గణపతి, మొండ్రేటి ప్రసాద్, ఆకుమురి అప్పన్న బాబు, పిల్లా దుర్గ ప్రసాద్, బుడ్డిగా శ్రీనివాస్, అడబాల నాగు పాల్గొని నిరసన తెలిపారు.