జగనన్న కాలనీలతో సాకారం కాని పేదల సొంతింటి కల: పాలకొండ జనసేన

  • ప్రచార ఆర్భాటాలే కాని ప్రభుత్వ పనితీరు క్షేత్రస్థాయిలో ఏమాత్రం కనిపించడం లేదు
  • జగన్ రెడ్డి జూన్ 2021 పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు 2022 నవంబర్ వచ్చిన ఇంకా చాలా వరకు పునాధులకే నోచుకొని జగనన్న కాలనిలు
  • పేదలకు న్యాయం జరిగేందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టాం…
  • జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం జనసైనికులు మత్స.పుండరీకం, జనసేన జాని, వావిలపల్లి నాగభూషణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

పాలకొండ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహించు జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 13వ తేది రెండవ రోజు వివిధ గిరిజన గ్రామాలకు సంబంధించిన జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తిగా కొండలకు దగ్గరి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొండల పైనుండి బండలు పడే ప్రమాదం ఉంది. ఒక ప్లాట్ 30 వేల నుంచి 3 లక్షల వరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. జగనన్న కాలనీలో కనీసం బేస్ మట్టాలు చీలిపోయిన దృశ్యాలు చూసాం, కనీసం మౌలిక సదుపాయాలైన విద్యుత్, నీరు, రవాణా సౌకర్యం కూడా ఇక్కడ లేవన్నారు. లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడం మాకు సాధ్యం కాదని మాకు బేస్ మట్టంకే (పునాదికే) లక్షల్లో ఖర్చు అవుతుందని , జగనన్న ఇల్లు ఎప్పుడు నిర్మిస్తారు తెలియజేయలని, ఒక ఇల్లు నిర్మించడానికి మినిమం 5,00,000 అవుతుందని ప్రభుత్వం 1,80,000 రూపాయలు ఇస్తే లబ్ధిదారులు ఎ విధంగా ఇల్లు నిర్మించుకుంటామని తెలిపారు, ఇంకా అనేక చోట్ల ఇల్లు నిర్మాణాలు కూడా చేపట్టలేదు ఎందుకు చేపట్టలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడం అంటే మా ప్రాణాలను మేము తెగించుకున్నట్లు అవుతుంది, ఇక్కడ క్రింద భాగంలో రాయి ఉన్నందువల్ల బేస్ మట్టం పది అడుగులు పైగా తీయాలి, లేదంటే ఇల్లు కూలిపోయే అవకాశం ఉన్నందువల్ల నిర్మించుకోలేకపోతున్నారు అని జనసైనికులు తెలియజేశారు, పది అడుగులు తీసి ఇల్లు నిర్మించుకుంటే బేస్ మట్టానికి లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు. జనసేన పార్టీ అండగా ఉండి మీ పక్షాన న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని తెలియజేసారు.