జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బి.వి.ఎస్.ఎస్. ప్రసాద్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీ వీ ఎస్ ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీ ప్రసాద్ ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలుపంచుకున్నారు. యాగశాలలో ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించుకున్న అనంతరం కార్యాలయంలోనే ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కాసేపు ముచ్చటించారు. పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారి ఎదుట వ్యక్తపరిచారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్.. పవన్ కళ్యాణ్ తో చెప్పారు.