పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలి – డాక్టర్ కందుల నాగరాజు

పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారకంగా నిర్వహించాలని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఉదయం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కొరకు తన ప్రాణాలనే త్యాగం చేశారని చెప్పారు. వారి కృషి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. భారతదేశంలో భాషా రాష్ట్రాలు ఏర్పాటుకు ఆ మహానీయుని కృషియే ప్రధాన కారణమని అన్నారు. కాని కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో రెండు ముక్కలుగా చేసి వారి ఆత్మకి తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చటానికి మన తెలుగు భాషా సంస్కృతులను సర్వనాశనం చేయటానికి పూనుకుంటున్నారేమో అని అనుమానం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 58 రోజులు ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణత్యాగం చేసి ఆంధ్రరాష్ట్రాన్ని వాధించి పెట్టిన పెట్టిన పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని లేదా మరెక్కడైన సరే వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణ ప్రసాద్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ ఎస్. మహేశ్వర రావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ ముక్కు శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఏ. వి.గుప్తా , జోన్ చైర్ పర్సన్ పులవర్తి రమేష్, ఆర్.సి. శివరామకృష్ణ, ఫాస్ట్ గవర్నర్స్ కామరాజు ప్రభాకర్, సోమేశ్వరరావు, మధుసూదన్, వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సెక్రటరీ శంభు, ట్రెజరర్ వినోద్, పులవర్తి శ్రీనివాసరావు, గ్రంధి దేవి, భారతి, ఎం. సురేఖతో పాటు
డిస్ట్రిక్ట్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.