పసుపులేటి హరిప్రసాద్ ను కలసిన పోతుల సాయినాథ్

తిరుపతి: తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుపతి వెలిసిన శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ రాక్షస పాలన పోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షమైన పరిపాలన జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీ సంతాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుని పూజా కార్యక్రమం అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములకలచెరువు మండల ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, అనిల్ రాయల్ ఉపాధ్యక్షుడు రామిశెట్టి నాగరాజు పాల్గొన్నారు.