18వ డివిజన్ ప్రాంతంలో ప్రజా చైతన్య పోరాటం యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో డివిజన్ నాయకురాలు చోడిపల్లి సత్యవతి ఆధ్వర్యంలో 18వ డివిజన్ ప్రాంతంలో ప్రజా చైతన్య పోరాటం యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రజా సమస్యలను వాకబు చేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు వానలు వస్తే రోడ్లు మునిగిపోతున్నాయనీ, కాలవల్లో పూడికలు తీయడం చేయట్లేదని దీనివల్ల దోమలు రోగాలు ప్రబలుతునాయని మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీకకుట్టినట్లు లేదనీ, అసలు మనం ఏయుగంలో ఉన్నామో అర్ధం కావడంలేదన్నారు. ముఖ్యమంత్రి ఎంతసేపూ పధకాలు బటన్లు అంటున్నాడనీ పాలన అంటే అవేనా ఇంకేమీ లేవా అని ప్రశ్నించారు. లోగడ సామెత చెప్పినట్లు కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందన్నట్టు పేరుకి కొన్ని పధకాలు కొంతమందికి ఇస్తూ కోట్లాదిమందిపై పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ అవినీతి ప్రభుత్వ పనులని ప్రజల్లో చేరవేయడం తమ బాధ్యతగా తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో చోడిపల్లి సత్యవతి, బండి సుజాత, చింతల రమ్య, శాంతి, మరియా, దీప్తి, అంగాడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.