రాజానగరం జనసేన శ్రేణులతో బలరామకృష్ణ ముఖాముఖి

రాజానగరం, రాజానగరం మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులతో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మండలంలో గల నాయకులకు కార్యకర్తలకు, వీరమహిళలకు, జనసైనికుల అపార్ధాలు, అపోహలు, అభద్రతాభావాలు, అధికార పార్టీ ఒత్తిడితో వారి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానిక అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో అధికార పార్టీ పెడుతున్న ఇబ్బందులు, త్రాగునీరు, సాగునీరు సమస్యలు మరియు వివిధ విషయాలపై ముఖాముఖి చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ మండల జనసేన శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణ, ఎలక్షన్ చేయడంలో ముందస్తు జాగ్రత్తలు, అధికార పార్టీ వారి వేధింపులకు ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని త్వరలో మంచి ప్రణాళికలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనకు తెలియచేస్తారు దాని ప్రకారం మన నియోజకవర్గంలో తు.చా తప్పకుండా పాటించి రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీనీ అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం అని తెలియ చేశారు. అంతే కాకుండా నావల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియచేస్తే దానిని సరిచేయడం కానీ, క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, వేగిశెట్టి రాజు, నాతిపాము దొరబాబు, బోయిడి వెంకట్, ఎర్రంశెట్టి శ్రీను, చిట్టిప్రోలు సత్తిబాబు, గుల్లింకల లోవరాజు, గల్లా రంగా, మదిరెడ్డి బాబులు, అరిగల రామకృష్ణ, ఈఊరి శ్రీను, పంతం సూరిబాబు, సంపత్ నగరం నాని, కొత్తపల్లి రఘు, చాపల లక్ష్మీ, సూరపరెడ్డి రాజారావు, గంగిశెట్టి రాజేంద్ర, కురుమళ్ల మహేష్, బొడ్డపాటి నాగేశ్వరరావు, స్టాలిన్, కమిడి సత్తిబాబు, డి.ఎం.ఎస్, సుంకర బాబ్జి, తోరాటి శ్రీను, అక్కిరెడ్డి వేణు, సంగుల రమేష్, రామిశెట్టి సతీష్, ఆనందేవుల సూరిబాబు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.