కోవూరు పెద్ద పిచ్చోడు ప్రసన్న.. వైసీపీ మంత్రులకు మానసిక రోగం పట్టుకుంది..!

  • గునుకుల కిషోర్ కార్యాలయంలో ప్రెస్ మీట్

నెల్లూరు: వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ నెల్లూరు జిల్లా ప్రధాన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవూరు పెద్ద పిచ్చోడు ప్రసన్న అని మంత్రి పదవి ఇవ్వని కారణంగా అతనికి మతిభ్రమించిందని గతంలో అతని పెద్దమనిషి అయ్యానని తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని తమ నేత వద్ద గొప్పల కోసం నోరు చేసుకుంటే జనసేన పార్టీ తరఫున లుంగీలు ఫంక్షన్ చేస్తామని కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదు అని తెలిసినా ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యల గురించి స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మాత్రమే స్పందించే ఎమ్మెల్యేని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని తెలియజేస్తూ పలు విషయాలపై స్పందన వారి ఏమిటి అని ప్రశ్నించారు.. అక్రమ లేఅవుట్ల పై మీ స్పందన ఏమిటి?, ఇసుక అక్రమ రవాణా పై మీ స్పందన ఏమిటి?, ఆక్వా రైతులు నష్టాలలో ఉన్నారు వారి గురించి మీ స్పందన ఏమిటి..?, అక్రమ గ్రావెల్ మైనింగ్ తవ్వకాల పై మీ స్పందన ఏమిటి..?, ఆర్.బి.కే కేంద్రాల్లో యూరియా లేమి దీనిపై మీ స్పందన ఏమిటి..?, అద్వానంగా ఉన్న పల్లెలు కనెక్టివిటీ రోడ్ల గురించి మీ స్పందన ఏమిటి?, క్యాన్సిల్ చేసిన పింఛన్లు గురించి మీ స్పందన ఏమిటి..?, స్మశాన వాటికలు కబ్జాల చేస్తున్న మీ నాయకుల పై స్పందన ఏమిటి..?, చాలా గ్రామాలకు స్మశాన వాటికలు దారి లేదు దీని పై మీ స్పందన ఏమిటి..?, రైతుల గిట్టుబాటు ధరల విషయంలో జవాబు ఇవ్వని మీ ప్రభుత్వ వైనం గురించి మీ స్పందన ఏమిటి..?, నియోజకవర్గంలో ఉపాది కల్పించగల షుగర్ ఫ్యాక్టరీ మూసివేసింది దాని పై మీ స్పందన ఏమిటి..?, తుఫాను బాదితుల్ని సహాయం చేయకపోగా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన మీ వైనం పై మీ స్పందన ఏమిటి..?, తమ ప్రాంతానికి బస్సులు లేవని అడిగినా రైతులు, ఆక్వా రైతులు తమకి నష్టపరిహారం అందలేదు అని అడిగిన ఎన్నోసార్లు అసహనానికి గురి కావడం మనం చూసిందే. ఇలా అనేక సమస్యలు నియోజకవర్గంలో ఉంటే వాటిపై స్పందించకుండా కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆదరణ ఓర్వలేక పిచ్చి పట్టినట్లుగా మాట్లాడటం తగదని తెలిపారు. ఇక మంత్రుల విషయానికొస్తే వైసిపి మంత్రులందరికి మానసిక రోగం పట్టుకుందని జనసేన పార్టీ సభలకు పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక చిత్ర విచిత్ర దోరణి లో స్పందిస్తున్నారని తెలిపారు. ఎల్లంపల్లి శ్రీనివాస్ అతను మనిషేనా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత భావం తో కులమతాలు లేని సమాజాన్ని స్థాపిస్తాను నాకు కులం, మతం పట్టింపు లేదు అంటే నీతి జాతి అని మాట్లాడుతాడు ఈ జాతి లో చెడ బుట్టినోడు. దేవాదాయ శాఖలో మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో ఆలయాలు కూల్చివేసిన ఘోష తనకు తగలకుండా పోదు. ఇక మంత్రి అమర్నాథ్ మా తాత ఎమ్మెల్యే మా నాయన ఎంపీ నేను ఎమ్మెల్యే అని రాజకీయ వారసత్వాలు గురించి ప్రస్తావిస్తారు. యువత మేలుకొంది రాజకీయం అన్ని వర్గాలకి అందేలాగా మేము పోరాడుతున్నారు. నెపోటిజం పనికిరాదని.. చేతకానప్పుడు రాజకీయాలను వదిలి పక్కవారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. ఇక రోజా గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు ఆమె అసమర్థకు పెద్ద లాకర్ లాంటిది తన అసమర్ధత వల్ల పర్యాటక శాఖను బ్రష్టు పట్టిస్తుంది. సంక్రాంతి సంబరానికి గంగిరెద్దులు నాట్యమాడాయి ఆ సంబరాల్లో మా సంబరాలు రాంబాబు నాట్యం చేశాడు పోలవరం పూర్తి చేసి ఆనక నాట్యం చేస్తే బాగుండేదేమో. ఆ పార్టీ పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ స్టార్ట్ కాగానే కెమెరా స్టార్ట్ చేసి ప్రెస్ ముందు కూర్చొని పిచ్చి పిచ్చిగా ఏఅం వాగుతాంఅని ఎదురుచూస్తుంటాడు.నాని నోటికొచ్చింది మాట్లాడడం తప్పిస్తే అతను సాధించింది ఏమీ లేదు. మీ పార్టీ గురించి ఆలోచించుకుని ఎక్కడెక్కడ ఎవరో ఉన్న పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు తక్కుతాయని ఆలోచించకుండా పక్క పార్టీ వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు ఎక్కడెక్కడ చేస్తారు అని మాట్లాడడం వ్యర్థమని తెలిపారు. ఇక జనసేన పార్టీ గురించి మొన్న ఈ మధ్య రూరల్ ఎమ్మెల్యే గారి తమ్ముడు మాట్లాడారు. ఓటుకు డబ్బు పంచకపోవడం చీప్ అయితే ప్రత్యర్థులను డబ్బుతో కొనక పోవడం చీప్ అయితే మీరు అలాగే అనుకోండి.. మా ఆదర్శాలను తప్పకుండా ఒక రోజు గెలిపించుకుంటాం.. ఇక పారదర్శకత గురించి మీరు మాట్లాడారు పారదర్శకత గురించి మీ దగ్గర ఎంత మాట్లాడినా కొంత తక్కువ అవుతుంది.. రూరల్ సిటీలో గంజాయి వినియేగం విచ్చలవిడిగా పెరుగుతుంది.. 13 సంవత్సరాల పిల్లవాడికి కూడా అందే పరిస్థితి ముందు దాని మీద దృష్టి సారించండి. ఇక ఆలీ గారి విషయానికొస్తే అతను పవన్ కళ్యాణ్ గారితో పోటీ సరా సరే వచ్చి నెల్లూరులో కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం జెండా వీధి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలవగలడేమో పరిశీలించుకోవాలి. వైసిపి నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో చెప్పులు చాటలతో సరైన సమాధానం చెప్తారని తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అన్ని వర్గాలకు రాజ్యాధికారం అందే విధంగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి గాజు గ్లాస్ ఓటు వేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు కంథర్ భాయ్, చిన్నరాజా, బాలు, వెంకటేష్, అలేఖ్, రేవతి, షాజహన్, ప్రసన్న, ప్రతాప్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.