ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి: నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్, మెడికల్ విద్యార్థిని ప్రీతి కుటుంబానికి జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ప్రీతి లాంటి పరిస్థితి మరే ఇతర విద్యార్థినికి రాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని జనసేన పార్టీ తెలంగాణా ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు.