ప్రేమ కుమార్ గెలుపుకి సహకరించాలి: శెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో పితాని

తెలంగాణ, హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట రాయల్ ఫంక్షన్ హాల్లో కూకట్పల్లి మరియు హైదరాబాద్ సిటీలో ఉన్న శెట్టిబలిజ సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కూకట్పల్లి జనసేన బిజెపి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపుకి సహకరించాలని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ప్రేమ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శెట్టిబలిజ సోదరులను కోరిన పితాని బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.