నోడగలపేట గ్రామంలో ఇంటింటికి జనసేన మేనిఫెస్టో

*పవనన్న ప్రజాబాట 82వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, నోడగలపేట గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మరియు అడుగుజాడల్లో నడుస్తున్న నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మరియు జనసేన పార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు బుధవారం ఉదయం నోడగలపేట గ్రామంలో పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్ళి యువతకి, మహిళలుకు జనసేనపార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి 82వరోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్ళి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టోను వివరిస్తూ విజయవంతంగా ముందుకు సాగడం జరిగింది. ఈసందర్భంగా గ్రామ ప్రజలతో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా 3000మందికి చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్న నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. వృద్ధులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జనసేనపార్టీ గెలిస్తే మహిళలుకు 5గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వబడును. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ బదులు 2500/-నుండి 3500 వరకు నగదను ఎకౌంటులో జమచేయబడును.. ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు ఇవ్వబడును, పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు.ఈ కార్యక్రమంలో నోడగలపేట గ్రామ పెద్దలు మహిళలు మరియు జనసైనుకు ప్రసాద్, సురేష్, కృష్ణా, గణేష్, శివాజి తదితరులు పాల్గొన్నారు.