జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ప్రెస్ మీట్

పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గంలో 14వ తేదీన జరుగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ గురించి ఇన్ ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 14 వ తేదీన జరుగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏలూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా ప్రజలు తరలి వెళ్తున్నాం.. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా లక్షల్లో ఈ సభకు తరలి రావడం జరుగుతుంది.. ఏలూరు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో, అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల్లో కమిటీల వారిగా మీటింగ్ లు వేసుకొని ఈ యొక్క సమావేశానికి బయలుదేరే కార్యక్రమం రూపొందించుకున్నాం.. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించే ప్రజా వ్యతిరేక పాలనకు అంతిమంగా చరమగీతం పాడే దిశగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూపకల్పన ఉంటుంది..

రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క జీవన సరళి మార్పు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఒక ప్రణాళికను రూపొందుకొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రతి ఒక్క గ్రామాలను, పట్టణాలను, ఏరియాలను అన్నింటినీ కూడా తాకే విధంగా ఈ ప్రణాళిక ఉంటుందని తెలియజేస్తున్నాము.

అవినీతి పాలనకు, దౌర్జన్య పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడే దిశగా ఈ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి ప్రజల పట్ల ఏవైతే తప్పులు చేస్తున్నారో.. ఆ తప్పులను సరిచేసుకోవాలని ఏలూరు జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం.

ఈనెల 14 వ తేదీన ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో 10 గం.లకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తదుపరి 12 గం.లకు ఇక్కడి నుండి వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని డివిజన్స్ నుండి కార్యకర్తలు, మహిళా సోదరీ మణులు అదే విధంగా యువతి యువకులు అందరూ అత్యధిక శాతంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరంకి పండు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు పసుపులేటి దినేష్ ,అగ్గాల శ్రీనివాస్, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *