జనసేన ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా నుండి భారీ సమీకరణకు ఏర్పాట్లు

*జనసేన ఆవిర్భావ సభకు తరలి రండి.. అనంతపురము జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లేలా జనసమీకరణ చేయాలని పిలుపు నిచ్చిన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్

అనంతపురము జిల్లాలో గురువారం జరిగిన జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ చరిత్రలో చిరస్థాయిగా నిలబడేలా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ పెద్దలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురము జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లేలా జనసమీకరణ చేయాలని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లకు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల అధ్యక్షులకు పిలుపు నిచ్చారు. ముఖ్యంగా సభకు వెళ్లే జనసైనికులు సభకు వచ్చిన దగ్గర్నుంచి సభ పూర్తయి తిరిగి వెళ్లే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. మరియు సభకు వెళ్లే మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లా మహిళా నాయకులతో సమన్వయం చేసుకోవాలని.. ఈ సభ గురించి 63 మండలాల ప్రజలందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో ప్రచారం, స్థానిక మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం.. అన్ని మండలాల నుంచి వచ్చే జనసైనికులను ఆహ్వానించడమే కాకుండా… మన నాయకులు, కార్యకర్తలు సమావేశానికి వెళ్లడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ఆవిర్భావ సభను విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కమిటీ సభ్యులు, రాయలసీమ ప్రాంతీయ మహిళా నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.