అత్యం క్వారీ ఆగడాలను అరికట్టండి..!

  • ప్రైవేటు వ్యక్తుల తోట మధ్యలో రోడ్లు వేసి జులుం చెలాయింపు క్వారీ వాహనాల రాకపోకలతో ప్రజలకు ఇబ్బందులు
  • బ్లాస్టింగ్, తారు, సిమెంట్ బ్రిక్ తదితర వాటి వలన పొల్యూషన్ సమస్యలు
  • ఇదేమని ప్రశ్నిస్తే తిరిగి కేసులు పెడుతున్నారు
  • జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు
  • జిల్లా అడిషనల్ ఎస్పీని కోరిన జనసేన పార్టీ నాయకులు, కొంకిడివరం సర్పంచ్

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం సమీపంలోని కొంకిడివరం, పెదగుడబ పరిసరాల్లో ఉన్న అత్యం వారి ఆగడాలను అరికట్టాలని కొంకిడివరం సర్పంచ్ అల్లు అప్పలనాయుడు జనసేన పార్టీ కార్యనిర్వాహణ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, వంగల దాలి నాయుడు, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలి నాయుడు, తెంటు శ్రీకాంత్, చింతాడ కామేష్, అలజింగి సింహాచలం, యోగి రెడ్డి అప్పలనాయుడు, అల్లు హరికృష, గౌరీ శంకర్, రఘు మండల అప్పలనాయుడు, చిట్ల గణేష్, చీమల సతీష్, నేరేడు బిల్లీ వంశీ, రమేష్ తదితరులు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్ .పి. డాక్టర్ ఓ. దిలీప్ కిరణ్ కలిసి ఆత్యం క్వారీ చేస్తున్న ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వారీ అనుమతులు లేకుండా తారు, సిమెంట్, బ్లాస్టింగ్, క్రషర్ తదితర కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఆయా కార్యక్రమాలకు గాను క్వారీ నుండి గ్రామాల సమీపంలో ప్రైవేటు వ్యక్తుల తోటలో మొక్కలు తొలగించి రోడ్డు వేసి దౌర్జన్యంగా వాహనాలను రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఆయా వాహనాలు రాకపోకల వలన పరిసర గ్రామాలు పెదగుడబ, కొంకడివరం తదితర గ్రామాల ప్రజలు పిల్లలు, అవస్థలు పడుతున్నారన్నారు. బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటి వలన పొల్యూషన్ పెరిగి, పర్యావరణం దెబ్బతిని గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన జిల్లా అదనపు ఎస్పీ తగు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ నిధులు సుమారు రెండు కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులతో ఎవరికి ఉపయోగం లేని రోడ్డు వేయటం పట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని తీసుకునేందుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు కలిసి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని వ్యవహరించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ తో మాట్లాడి తగుచర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, బాధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.