వంగవీటి మోహన రంగా కి నివాళులు అర్పించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బెబ్బులి ప్రజా సమస్యల పోరాటానికై తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా 76 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ సాహసమే తన ఊపిరిగా తిరుగుబాటే తన వేదాంతం గా దుర్మార్గులను అంతం చేయడమే రంగన్న సిధ్ధాంతం గా జీవించారు. వంగవీటి మోహన రంగా ఈ పేరు వింటే చాలు పేద బడుగు బలహీన వర్గాల బహుజనులు రెండు చేతులు జోడించి ఆరాధనా భావంతో వందనాలు చేస్తారు. ఈ సందర్భంగా రంగా కి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బడేటి చంటి, కృష్ణ, రాధా రంగా మిత్రమండలి అన్నీ కార్యక్రమాల్లో చివరి దశలో భాగస్వాములై ఆనాడు రంగా పేద ప్రజల కోసం పేద బడుగు వర్గాల కోసం తాను మరణిస్తానని తెలిసి కూడా ఏ మనిషి అయినా గాని అదిరి బెదిరి జడిసి పిరికితనంతో ఎంతో కాలం బ్రతకలేము. ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించాలి. అనేక రకాల త్యాగాలకు సిద్ధం అవ్వాలని అనేకమైన మీటింగ్ లో వారు చెప్పేవారు. మనమందరం కూడా కులాల వారీగా విడిపోకుండా ఒక శక్తి లాగా ఏదైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పేదలు మధ్యతరగతి వర్గాలు అన్యాయానికి గురి అవుతున్నారు. వారి ముందు ఉండి పోరాటం చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియలో మనం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని అనేకసార్లు సందేశాలు ఇచ్చారు. అదేవిధంగా 1988 డిసెంబర్ 26 న ఆయన అక్కడ నిరాహార దీక్ష చేస్తే మరణిస్తారని ఆయనకి ముందే తెలిసినప్పటికీ కూడా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం అయ్యారు. ఏదేమైనా పేద బడుగు వర్గాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తి లేకుండా మరణానికి కూడా సిద్ధపడినటువంటి త్యాగ శీలుడు, మంచి మనసు కలిగినటువంటి వారు వంగవీటి మోహన రంగా. వారు మరణించి అన్ని సంవత్సరాలు అయినా కానీ రాష్ట్రవ్యాప్తంగా కృష్ణ, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా అంతట అనేక జిల్లాల్లో ఆరోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రంగా విగ్రహాలని ఆవిష్కరించారు. అటువంటి ఆ మహానుభావుడి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన యొక్క వర్ధంతి సభలు గానీ, జయంతి సభలు గానీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి విధానం ఆయన అనుసరించిన జీవితాన్ని ఆయన చేసినటువంటి త్యాగంతో మనమందరం కూడా ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. మనమందరం కూడా మనం నమ్మినటువంటి ప్రజల కోసం, సమాజం కోసం బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడిని వ్యతిరేకిస్తూ పోరాట దిశగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయనను అనుసరించి ప్రయాణం చేస్తామని, వారికి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. అమర్ రహే వంగవీటి మోహన రంగా. ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలు చిగురుస్తూనే ఉంటాయని ఆశిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, నాయకులు బోండా రాము నాయుడు, వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, వేముల బాలు, నాగభూషణం, జనపరెడ్డి తేజ ప్రవీణ్, రాపర్తి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.