విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరిస్తాం: కేంద్రం

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్‌సభలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్‌.పి.సింగ్‌ సమాధానమిచ్చారు. ”ప్రభుత్వ పెట్టుబడి ఉపసంహరించాలని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ ఉపసంఘం నిర్ణయించింది.

పెట్టుబడి ఉప సంహరణతో నిర్వహణ, సాంకేతికత, సామర్థ్యం పెరుగుతాయి. అధిక ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగులు, సిబ్బంది, వాటాదారులను పరిగణనలోకి తీసుకున్నాం. అన్నీ పూర్తయ్యాక షేర్‌ పర్చేజ్‌ ఒప్పందం జరుగుతుంది” కేంద్ర మంత్రి వెల్లడించారు.