ఏలూరులో జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో గుంతల రోడ్లపై నిరసన

ఏలూరు: రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక పాలన అంతానికి టిడిపి, జనసేన పార్టీలు నడుం బిగించాయి. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నాయి. టిడిపి, జనసేన పార్టీల కలయిక అనంతరం మొదటిసారిగా ఏలూరు నగరంలో రోడ్ల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. బిర్లా భవన్ సెంటర్ నుండి శ్రీకృష్ణదేవరాయల హై స్కూల్, ఏడు గోరీల సెంటర్ మీదుగా కైకలూరు రోడ్డు వరకు తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. ఇదేమ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇవేమి రోడ్లు… గోతులు రోడ్లు, గుంతల రోడ్లు, హలో ఏపీ.. బై బై వైసీపీ, సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధ్వంసమైన రోడ్లపై ఉన్న గుంతలకు పూల మాలలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేసి రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వాని సాగనంపుతామని నినాదాలు చేశారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు, బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యేతో, పాటు కార్పొరేషన్ పాలకవర్గం నిద్రావస్థలో జోగుతోందన్నారు. ప్రతీ రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే మాంగో బార్ నుండి బిర్లా భవన్ సెంటర్ వరకు 14వ ఆర్థిక సంఘం నిధులతో ప్రధాన రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే ఆళ్ల నాని 2020లో శంకుస్థాపన చేశారని, రోడ్డు మాత్రం నిర్మించలేదన్నారు. ఏలూరు నగరంలో ఏ ప్రాంతంలో చూసిన ధ్వంసమైన రహదారులు దర్శనమిస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పాడిగట్టి సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. సంక్షేమం పేరుతో పేద ప్రజలను జగన్ సర్కార్ లూటీ చేస్తూ ఆర్థిక భారాన్ని మోపుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే టిడిపి, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. టిడిపి, జనసేన పార్టీ కార్యకర్తల శ్వాస నుంచి వచ్చే గాలికి వైసిపి కొట్టుకుపోతుందని, ఇక మచ్చుకైనా కనిపించదని, చిరస్థాయిగా జగన్ జైలుకే పరిమితం అవుతాడని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు, లక్ష్యం కలిగిన పవన్ కళ్యాణ్ లు కలిసి పని చేస్తున్నారని చెప్పారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న కోట్ల రూపాయల ఆదాయం ఏం చేస్తున్నారో చెప్పాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మేయర్, కార్పొరేటర్లతో పాటు అధికారులను నిలదీశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శ్రావణ్ కుమార్ గుప్తా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, బొండా రాము నాయుడు, ప్రచార కమిటీ కార్యదర్శి రాపర్తి సూర్యనారాయణ, పార్టీ నగర ఉపాధ్యక్షులు భేతా ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, బొత్స మధు, ఎట్రిచి ధర్మేంద్ర, కందుకూరి ఈశ్వరరావు, కూనిశెట్టి మురళీకృష్ణ, జనసేన రవి, పైడి లక్ష్మణరావు, చిత్తిరి శివ , ప్రమీల రాణి, ప్రేమ్, కృష్ణ, తేజ, నూకల సాయి, వల్లూరి వంశీ, పవన్, టిడిపి ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, నాయకులు పాలి ప్రసాద్, చోడే వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, పూజారి నిరంజన్, గూడవల్లి వాసు, మారం అను, బౌరోతు బాలాజీ, వందనాల శ్రీను, ఆర్నెపల్లి తిరుపతి, జాలా బాలాజీ, రెడ్డి ఈశ్వరరావు, మాకాల రమేష్, చోడే బాలు, తవ్వా అరుణ కుమారి, పిళ్ళారిశెట్టి సంధ్య, మెరుగుమాల శ్రీను, కూన మాణిక్యం, పైడి వెంకటరావు, గణేష్, బడిశెట్టి శ్రీను, పిళ్ళారిశెట్టి సురేష్, కెంగం లక్ష్మణరావు‌, పరుశురామ్, పలివెల కిషోర్, జాగాని సంతోషి త్రిపర్ణ రాజేష్, మెళ్ళిపాక వెంకన్న, నెరుసు గంగరాజు, మంత్రి మహాలక్ష్మి నాయుడు, టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.