రాధయ్య చెంతకు జనసేన

  • జనసేన ఒక అక్షయ పాత్ర – సేవలు అందించడమే లక్ష్యం:
  • జనసేన అధికారంలోకి రాగానే
  • దివ్యాంగులకు పదివేలు పెన్షన్
  • నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న.

గంగాధర నెల్లూరు, కార్వేటినగరం మండలంలోని కార్వేటినగరం ఈస్ట్ ఏఏడబ్ల్యు కు చెందిన రాదయ్య అనే వ్యక్తికి సుమారు ఏడు నెలలుగా వేలిముద్రలు పడలేదంటూ రేషన్ బియ్యం అందక అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయాన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఇలాకాలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఇక్కడ ఒక దివ్యంగునికే న్యాయం చేయలేని ప్రభుత్వం. ఏడు నెలలుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించు కోకుండా అధికారులు ఉన్నారంటే ఎవరిని ప్రశ్నించాలి అంటూ యుగంధర్ అడగడం జరిగింది. కార్వేటినగరం తాసిల్దార్ ఆఫీస్ లో ఒక దివ్యాంగుడు (రాదయ్య) రోజూ గంటలకొద్ది తనకు సాయం చేయాలని కోరి, వేచి ఉన్నా ఏ అధికారి పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు న్యాయమని తెలిపారు. అయితే కార్వేటి నగరం తాసిల్దార్ రాధయ్యకు న్యాయం చేయాలనీ కోరారు. ఈ సందర్భంగా రాజయ్యకు 25 కేజీల బియ్యము, నిత్యవసర సరుకులు పంపిణీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశారు. జనసేన పార్టీ ఒక అక్షయపాత్ర అని, ఇది ఎల్లప్పుడూ నిరుపేదల చెంతకు వెళ్లి సేవలందిస్తుంది అని తెలియజేశారు. పరోపకారమే జనసేన పార్టీ లక్ష్యమని, ప్రజాసేవకు ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ క్షోభ ఉంటే, ఎక్కడ అత్యవసరం ఉంటే అక్కడ జనసేన ఉంటుందని తెలిపారు. జనసేన అధికారంలోకి రాగానే దివ్యాంగులకు పదివేలు పెన్షన్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శోభన్ బాబు, మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, ఉపాధ్యక్షులు విజయ్, మండల బూత్ కన్వినర్ అన్నామలై, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, నరసింహులు మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మహేంద్ర చందు, అరవింద్, ప్రవీణ్, మునికృష్ణ, రాజు, జనసైనికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.