జగనన్న కాలనీలలో రైల్వే కోడూరు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

రైల్వే కోడూరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట పంచాయతీలో జనసేన ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. రాఘవరాజుపురం పంచాయతీ లబ్దిదారులను ఎంపిక చేసి 130 ప్లాట్లకు పైగా.. 4 ఎకరాలలో కేటాయించడం జరిగింది. కానీ వారికి ఈ ప్రదేశానికి 8 కి.మీ దూరం ఉందని, నివాసయోగ్యంగా లేవని మూకుమ్మడిగా తిరస్కరించారు. అనువైన ప్రదేశంలో ఇళ్ల పట్టాలను ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఉత్తరాది శివకుమార్, జనసేన సీనియర్ నాయకులు అంకిశెట్టి మణి, జనసేన సీనియర్ నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్,
జనసేన నాయకులు బల్లేపల్లి శ్రీనివాస్, జనసేన సీనియర్ దళిత నాయకులు నగిరిపాటి మహేష్, మరియు శీను పాల్గొన్నారు.