ఇప్పటం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి సరికాదు: రాజంపేట జనసేన

అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం గుంటూరు జిల్లా ఇప్పటం ప్రజలు జనసేన పార్టీకి మద్దతు తెలిపారని, ఈ ప్రభుత్వం ప్రజలపై కక్ష సాధింపు చేయడం సరికాదు. రోడ్ల విస్తరిస్తున్నామని సాకుతో ఇప్పటం గ్రామంలోని జనసేన ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇది సరికాదు. ఈ ప్రభుత్వం జనసేన నాయకులను ఎంత అనగదొక్కాలనుకుంటారో బంతిలాగా అంత వేగంగా అభివృద్ధి చెందుతామని రాజంపేట జనసేన పార్టీ నాయకుడు పోలిశెట్టి శ్రీను అన్నారు. ఈ పాలన ప్రజాస్వామ్య పాలనేనా..? లేక రాక్షస పరిపాలన అని జనసేన నాయకులు తీవ్రంగా ఖండిస్తూ, ఇప్పటం ప్రజలకు మేము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సేల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, భువనగిరిపల్లి శంకరయ్య, వీరయ్య ఆచారి, బండ్ల రాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది.