బొర్రా ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న రాజశ్యామల యాగం

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా ఉంది. అందుకు కారణం బొర్రా వెంకట అప్పారావు గత 2022 డిసెంబర్ లో వెంకట అప్పారావు జనసేన పార్టీని మోస్తూ అనుక్షణం పార్టీ కోసం శ్రమిస్తూ అపరిమితంగా ఖర్చు పెడుతూ పార్టీని అభివృద్ధి చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే సత్తెనపల్లి జనసేన పార్టీని అగ్రభాగాన నిలిపాడు. తన మనసులో సంకల్పించుకున్న విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాలు, పట్టణము కలిపి పాదయాత్ర చేసుకుంటూ నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో వేంచేసియున్న స్వామి దేవాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని సంకల్పిస్తూ తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజ శ్యామల యాగం చేయాలని తలపెట్టారు. యాగాన్ని తలపెట్టిన తలంపుగా గత మూడు నెలల క్రితం బొర్రా సత్తెనపల్లి మండలం గర్నెపూడి నుండి రెండు రోజులు పాటు పాదయాత్ర జరిగిన పెమ్మట సరైన అనుమతులు లేవన్న కారణంతో ప్రభుత్వం పాదయాత్ర సదరు విషయమై హైకోర్టులో అనుమతులు పొంది తద్వారా స్థానిక పోలీస్ వారి అనుమతితో వారం రోజులు క్రితం పాదయాత్రను పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసి చివరి రోజున చేజర్ల చేరి ఈనెల 5వ తేదీ నుండి ఈ యాగాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రాజశ్యామల యాగాన్ని కొనసాగిస్తున్నారు యాగం ప్రారంభమైన ఐదవ తారీఖున వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి దర్శనం చేపించి యాగాన్ని ప్రారంభించారు యాగశాలలో అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఆ హక్కులకు పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసి నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం విరామ సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామస్తులందరికీ ఆహ్వానం పంపి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులకి అందరికీ కూడా ఆహ్వానం పలికి ఈ యాగంలో భాగస్వాములు చేయాలని సంకల్పించారు. అనేకమంది పార్టీలకతీతంగా ఈ యాగాన్ని సందర్శించి రాజశ్యామల దేవికి కృపకి పాత్రులయ్యారు. ఈ యాగం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతుంది కాగా బొర్రా చేపట్టిన ఈ రాజశ్యామల యాగం సత్తెనపల్లిలోను, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది సొంత పార్టీ అనే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తలపెట్టిన ఈ యాగం పట్ల హర్ష వ్యక్తం అవుతుండగా పార్టీలకు విస్మయాన్ని కలిగిస్తోంది ఏది ఏమైనాప్పటికీ రాష్ట్ర శ్రేయస్సుని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తమ అధినేత ముఖ్యమంత్రి కావాలని సంకల్పిస్తూ చేపట్టిన ఈ యాగం సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుకుందాం ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలే కాక పార్టీలకు అతీతంగా అందరూ తమ సహకారాన్ని అందిస్తున్నారు సత్తెనపల్లి నియోజకవర్గంలో నుంచే గాక ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కపోకేశ్వర స్వామి కృపకు అదేవిధంగా రాజ్యశ్యామల మాత కృపకు పాత్రులు అవుతున్నారు. బుధవారానికి మూడవరోజు పూర్తవుతున్నది. ఈనెల 9వ తేదీతో ఈ యాగం ముగుస్తుంది.