బాలు త్వరగా కొలుకోవాలని ట్విట్టర్ ద్వారా వీడియోను షేర్ చేసిన రజనీకాంత్

కోవిడ్ 19 కారణంగా ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఆగస్ట్ 5న చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. బాలు కోలుకోవాలని ఇండస్ట్రీకి చెందిన ప్రతి కళాకారుడు ప్రార్ధించారు. సెలబ్రిటీలు ఎందరో ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేశారు. తాజాగా రజనీకాంత్ కూడా బాలు ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకున్నారు.” భారత దేశంలోని పలు భాషలలో ఐదు దశాబ్ధాలుగా అలరిస్తూ వస్తున్న బాలసుబ్రహ్మణ్యంగారు కరోనా వలన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా వీడియోను షేర్ చేసారు.