ఎంసెట్ దరఖాస్తుకు మరికొంత సమయం

తెలంగాణ స్టేట్ లో ఎంసెట్‌కు అప్లై చేయని విద్యార్థులకు మంచి ఛాన్స్. తెలంగాణలో ఎంసెట్‌కు అప్లై చేయడానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్-TSCHE మరో అవకాశం కల్పించింది. రూ.10,000 ఆలస్య రుసుము చెల్లించి ఆగస్ట్ 31 వరకు దరఖాస్తు చేయొచ్చు.

 తెలంగాణ ఎంసెట్ 2020 దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా విద్యార్థులు ఎవరైనా ఇప్పటివరకు దరఖాస్తు చేయలేకపోతే వారికి మరో అవకాశం ఉంది. కానీ రూ.10,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 31 వరకు eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

జూలైలో జరగాల్సిన ఎంసెట్ పరీక్షలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో ఎంసెట్ ఎప్పుడు నిర్వహిస్తారన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. గత వారం విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షలపై సమీక్షంచారు. తెలంగాణ ఎంసెట్‌ను సెప్టెంబర్ 9 నుంచి నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. తుది షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. తెలంగాణలోని వేర్వేరు కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతీ ఏటా ఎంసెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ఉంటాయి. ఆ ర్యాంకుల ద్వారా కౌన్సిలింగ్‌లో కోర్సుల్ని, కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.