రాజుపాలెం మండలం జనసేన ఆత్మీయ సమావేశం

సత్తెనపల్లి: రాజుపాలెం మండలం జనసేన అధ్యక్షులు తోట నరసయ్య ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని మండల జనసేన పార్టీ కార్యలయం నందు రాజుపాలెం మండల జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజుపాలెం మండలంలో జనసేన పార్టీ తరుపున జరగవలసిన, జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చింటం జరిగింది. 2023 సంవత్సరం సంక్రాంతి సంబరాలలో బాగంగా – సంబంధించిన రాజుపాలెం మండల స్థాయి ముగ్గుల పోటీల గురించి చర్చింటం జరిగింది, మండలంలోని అన్ని గ్రామాలలో జనసేన మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి చేరవేసే విధంగా పార్టీ కార్యక్రమం జరుపుకుందాం అని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ అద్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.