టిడిపి చేపట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతు తెలిపిన రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు, నారా చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక అరెస్టును ఖండిస్తూ పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ సోమవారం బంద్ లో పాల్గొనకుండా హౌస్ అరెస్ట్ లో ఉన్న పెడన నియోజకవర్గం తెలుగుదేశం ఇంఛార్జి కాగిత కృష్ణ ప్రసాద్ కు పెడన నియోజకవర్గం జనసేన పార్టీ తరపున సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి ఒడుగు ప్రభాస్ రాజు, కృష్ణా జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి చంద్రమౌళి, కృత్తివెన్ను మండలం ఉపాధ్యక్షుడు పాశం నాగమల్లేశ్వర రావు, కార్యదర్శులు తెలగంశెట్టి ఏడుకొండలు, కొప్పినేటి నరేష్, కాజ మణికంఠ, బంటుమిల్లి మండల ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, యడ్లపల్లి రుకేష్, పోలగాని లక్ష్మీ నారాయణ, అశోక్ కుమార్, మల్లి బాబు, పెడన నియోజకవర్గ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.