శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి తిరుణాళ్ళ మహోత్సవంలో పాల్గొన్న రామశ్రీనివాస్

అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి, వీరబల్లి మండలాల సరిహద్దుల్లో రాయచోటి నుండి రాజంపేట వెళ్ళే రోడ్డు మీద మర్రిచెట్టు వద్ద వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి తిరుణాళ్ళ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అలానే రామాండ్లపల్లి, వాసి చిన్నగొల్లపల్లి, గ్రామపంచాయితీ సర్పంచ్ రామజయచంద్ర మరియు పలువురు చేపట్టిన అన్నదాన కార్యక్రమం ఆహ్వానం మేరకు భక్తులు, స్థానిక గ్రామస్థులు, రాజకీయ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, ప్రజలు పాల్గొన్నారు. పెద్దగొల్లపల్లి, అన్నదానంవాండ్లపల్లి, సానిపాయి, చుట్టు పక్కల గ్రామాల వారు భక్తి శ్రద్ధలతో చాందని బండ్లు, చెక్క భజనలు, డిజెలు, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్థులు, భక్తులు, యువకులు, వివిధ ప్రాంతాల ప్రజలు, బంధుమిత్రులతో భారీ ఎత్తున హాజరయ్యారు.