“బత్తుల” ఆధ్వర్యంలో 1200 ముస్లిం కుటుంబాలకు “రంజాన్ తోఫా”

  • “అల్లా” చూపిన సత్యమార్గం అందరికీ అనుసరణీయం… -బత్తుల బాలరామకృష్ణ
  • ముస్లిం సోదరుల సహకారంతో, వారితో మమేకమవుతూ భక్తిశ్రద్ధలతో చేపట్టిన “రంజాన్ తోఫా” కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులు.
  • మతసామరస్యానికి ప్రతీకగా ఆనందంతో వెల్లువిరిసిన ‘రంజాన్ తోఫా’ కార్యక్రమం.

రాజానగరం నియోజకవర్గం, పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల్లో సుమారు 26 గ్రామాల్లో ఉన్న 1200 ముస్లిం కుటుంబాలకు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరాకృష్ణ, శ్రీమతి వెంకట లక్ష్మి దంపతులు పవిత్ర రంజాన్ మాసం ముగిసే ‘ఈదుల్ పీతర్’ను భక్తిశ్రద్ధలతో జరుపుకున్న శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు “రంజాన్” శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ పండుగను మరింత సంతోషంగా జరుపుకునేవిధంగా ‘రంజాన్ తోఫా’ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజానగరం జనసేన నాయకురాలు మరియు నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ సత్య నిష్ఠ, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో దివ్య ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రేమ, సహనం, దానం, భగవంతుని ధ్యానం కలిసిన ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి పవిత్ర ‘రంజాన్ పండుగ’ ఇంత వైభవంగా చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లా ఆశీస్సులతో అందరి జీవితాలలో వెలుగులు నిండాలని, ఆయన చూపిన సన్మార్గంలో అందరూ నడిచి, ఆధ్యాత్మిక చింతనతో మంచి జీవితం గడపాలని ఆకాంక్షింస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ కోరుకునే మతసామరస్యం, కులాల ఐక్యతకు, మతాల మధ్య స్నేహ సంబంధాలకు అద్దం పట్టేలా ఈ ‘రంజాన్ తోఫా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా చేపట్టి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మానవాళిపై ఆ ‘అల్లా’ ఆశీస్సులు దయ అందరిపై ఉండి, అందరూ ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయన చూపిన సత్యమార్గంలో అందరూ నడిచి మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ ఆకాంక్షించారు. జనసేన పార్టీ పక్షాన ‘బత్తుల’ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులు, మత పెద్దలు, సీనియర్ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారు.