రావికమతం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

  • పంటలు నష్టపోయిన రైతులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి
  • వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గంటల కరెంటును నిరంతరాయంగా సప్లై చేయాలి

చోడవరం: కవగుంట రైతులతో సమావేశంలో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను, చక్కెర బకాయిలను చెల్లించకుండా బస్సుయాత్ర పేరుతో రైతులను ప్రజలను మోసం చేస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టిన చోడవరం జనసేన ఇంచార్జి పి వి ఎస్ ఎన్ రాజు. పంట నష్టపోయిన కొంత మంది నిరుపేద రైతులకు పార్టీ తరఫున స్వంత నిధులతో కొంత మేర ఆర్ధిక సహాయం చేస్తామన్న ఇంచార్జి పి వి ఎస్ ఎన్ రాజు. వర్షపాతం సగటు కన్నా తక్కువగా వుండడం వలన పంటలు నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకొనుటకు బుధవారం రావికమతం మండలం నందలి కొమిర, కౌగుంట, కెబిపి అగ్రహారం, గుమ్మాలపాడు గ్రామముల వ్యవసాయ భూములను చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకొన్నారు. కవగుంట గ్రామ రైతులు, మహిళలుతో జరిగిన ముఖా ముఖి సమావేశంలో పంటలు కోల్పోయిన తమకు ఎలా బ్రతకాలో తెలియడం లేదన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను, చక్కెర బకాయిలను చెల్లించకుండా బస్సుయాత్ర పేరుతో రైతులను ప్రజలను మోసం చేస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వ వైఖరిని తూర్పురబట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు, పార్టీ నాయకులు బలిజ మహారాజు, లొట్ల శివ, బంటు రామునాయుడు, యతిరాజ్యంభూషణం, పోలమ్మ, గెంజి ప్రసాద్ , కోన రమణ, పరమేశ్ , బండి అర్జున, లోవా, అయితిరెడ్డి రమణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.