యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేసిన రాయపురెడ్డి

మాడుగుల: కె.కోటపాడు మండలం, వారాడ పంచాయతీకి చెందిన యువతకు మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ ఆర్థిక సహాయంతో కె.కోటపాడు మండల నాయకులు కుంచా అంజిబాబు ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా రాయపురెడ్డి కృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి అత్యంత సన్నిహితులు మరియు బలంగా ఉండే యువతను రోజురోజుకీ ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు మండలం గంగునాయుడు పైడ్రాజు, శ్రీను, సూర్య, ఈశ్వరరావు, రాజు, యువరాజు, గణేషు, మరియు మండల జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.