రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.1-8-21,ఆదివారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మామిడికుదురు మండలం పెద్దపట్నలంక గ్రామానికీ చెందిన దంగేటి సత్యనారాయణ గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో కోమ్ముల జంగమయ్య గారిని సంప్రదించగా.. జంగమయ్య గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో దంగేటి సత్యనారాయణ గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife