అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: అయ్యప్ప అన్నసమారాధనోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మాలధారణ స్వాములకు జరుగుతున్న 23వ రోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష స్వాములకు ప్రతిరోజు భిక్ష అందిస్తున్న ఏలూరు అయ్యప్ప అన్న సమారాధన ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనీయులని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు.. ఏలూరు బాలాజీ థియేటర్ రోడ్ లోని లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు మిల్లు ఆవరణలో జరుగుతున్న భిక్షా కార్యక్రమంలో శుక్రవారం రెడ్డి అప్పలనాయుడు పాల్గొని దీక్ష స్వాములకు అయ్యప్ప అన్నప్రసాదాన్ని వడ్డించారు. అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడుకు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన స్వాములు వడై, బిక్ష ఎక్కడ చేయాలి? ఏ విధంగా చేయాలి, ఇంటి వద్ద పరిస్థితిలు అనుకూలించకపోతే హోటల్లో నిబంధనలకు అనుకూలంగా వడై, భిక్ష లభించేది కాదన్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు, దాతలు ఏలూరు అయ్యప్ప అన్న సమారాధన ఉత్సవ కమిటీగా ఏర్పడి గత 18 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఉదయం వడై, మధ్యాహ్నం భిక్ష అందజేస్తున్నారన్నారు.. అంతేకాకుండా ప్రతిరోజు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడమే కాకుండా వేలాది మందితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.. కమిటీ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఎంతో మహిమ కలిగిన అయ్యప్ప స్వామి దీక్ష అనేకసార్లు తాను కూడా చేపట్టానని, శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నానని, విజయాలు అందించే అయ్యప్ప స్వామి దీక్షను స్వాములందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.‌ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, వీరమహిళ గాయత్రి, పార్టీ నాయకులు నూకల సాయి ప్రసాద్, నిమ్మల శ్రీను, వేగి సత్యనారాయణ, ఏలూరు అయ్యప్ప అన్న సమారాధన ఉత్సవ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.