ఏలూరులో మలివిడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తమ కార్యకర్తలకు అండగా నిలవాలని ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ “క్రియాశీలక సభ్యత్వం” మలివిడతగా మంగళవారం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క జనసైనికులు, వీరమహిళలు, మెగా అభిమానులు ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసుకొని మీ కుటుంబానికి రక్షణగా నిలవాలని రెడ్డి అప్పల నాయుడు కోరారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ… ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ కార్యకర్తలను వాడుకుని వదిలేసే అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. కానీ కార్యకర్తల శ్రేయస్సు కోసం కార్యకర్తల కుటుంబానికి అండగా ఉండటం కోసం ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి భీమా వర్తించే విధంగా 500 రూ.పెట్టి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటే ఆ కార్యకర్త ఏదైనా ప్రమాదం చేత, ఏదైనా యాక్సిడెంట్ అయి, అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో మరణించినట్లయితే 5లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా భీమా చేయించి పార్టీ తరపున ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలా కాకుండా చిన్న ప్రమాదంలో యాక్సిడెంట్ అయి ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ అయితే మెడికల్ ఖర్చు నిమిత్తం వచ్చే వెసులుబాటును కూడా ఈ ఇన్సురెన్స్ లో జనసేన పార్టీ నుండి ఈ స్కీం ను తీసుకు రావడం జరిగింది. గత సంవత్సరం దాదాపు 2 కోట్ల 50 లక్షల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసైనికులు ఎక్కడైతే ప్రమాదం చేత మరణించారో వారికి ఆ కుటుంబానికి ఆదుకునే పరిస్థితి ఈ మధ్యకాలంలో చూశాం.. అందుకని క్రియాశీలక సభ్యత్వం రెన్యువల్ సందర్భంగా ఏలూరు నగరం లో ఏలూరు నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం మలివిడత మొదలు పెట్టడం జరిగింది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ఉపాధ్యక్షుడు బొత్స మధు,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు పసుపులేటి దినేష్, ఎట్రించి ధర్మేంద్ర, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.