నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ.. రోజుకు సగటున 1529 రిజిస్ట్రేషన్లు

ధరణి లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. ధరణి వెబ్‌సైట్‌ ఆధారంగా సగటున రోజుకు 1529 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈనెల 2వ తేదీన ధరణి ఆధారంగా డాక్యుమెంట్ల నమోదు ప్రారంభం కాగా.. శుక్రవారం నాటికి 24,476 దస్తావేజులు రిజిస్టర్‌ అయ్యాయి. మొత్తం 26,012 స్లాట్‌లు రాగా.. వివిధ కారణాలతో 919 డాక్యుమెంట్ల నమోదు జరుగలేదు. గురువారం 1854 స్లాట్‌లు బుక్‌ చేసుకోగా.. శుక్రవారం వాటిలో 1706 స్లాట్‌లను పూర్తిచేసి.. రిజిస్ట్రేషన్‌ చేశారు. డాక్యుమెంట్ల నమోదు అంతా వడివడిగా జరుగుతోంది. స్లాట్‌ బుక్‌ చేసుకొని అన్ని వివరాలతో తహసీల్దార్‌ కార్యాలయంలో అడుగుపెట్టగా… 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతోంది.