ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు

రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను ఏపీ ప్రభుత్వం సడలించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సడలింపులు ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండగా.. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సడలించిన వేళలు ఈనెల 21 నుంచి అమల్లోకి రానున్నాయి.తూర్పుగోదావరిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు కొనసాగనుంది.