అభ్యంతరకర ఫ్లెక్స్ లను వెంటనే తొలగించండి

నెల్లూరు: నగరంలో నిరుపయోగంగా ఏర్పాటుచేసిన అభ్యంతరకర ఫ్లెక్స్ లను వెంటనే తొలగించండి.. అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గురువారం మున్సిపల్ కమిషనర్ అందుబాటు చేయడం లేకపోవడంలో డిప్యూటీ కమిషనర్, నగర డి.ఎస్.పి, వన్ ఎస్సై లను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన తరఫున ముఖ్య నాయకులు వస్తే ఒకటిన్నర రోజు ఫ్లెక్సీల పై నానా రాద్ధాంతం చేసిన అధికారులు అనుమతులు లేని పలు అభ్యంతర ఫ్లెక్సీలు తొలగించడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఐఏఎస్ కేడర్లో ఉన్న ఉద్యోగులు వీటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎటువంటి అసమానతలు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు పక్షపాత వైఖరి చూపడం మంచిది కాదు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు రాబోయే మూడు నెలల్లో ఎక్పైరీ అయుపోతుంది. మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన అధికారులు వారి ప్రలోభాలకు గురి అవ్వవద్దని మనవి. వెంటనే చర్యలు తీసుకుని ఫ్లెక్సీలను తొలగించాలి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకులతో కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, షాజహాన్, ఖలీల్, వర్షన్ కేశవ పాల్గొన్నారు.