దోమలు బెడద తొలగించాలి!

  • గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టాలి
  • తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలి
  • విద్యుత్ కోతల లేకుండా చర్యలు చేపట్టాలి
  • దోమతెరలు వినియోగం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
  • మలేరియా, డెంగ్యూ జ్వరాల ప్రబలకుండా చూడాలి కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: మన్యం జిల్లాలో దోమల బాధలు లేకుండా చూడాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం ఆ పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు జిల్లాలో విరివిగా కురుస్తున్నందువలన దోమలు బెడద ఎక్కువైందన్నారు. దీంతో ప్రజలు మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలు భారిన పడుతున్నారన్నారు. కాబట్టి సంబంధిత అధికారులు దోమల నివారణకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి గాను జిల్లాలోని అన్ని గ్రామాలలో పట్టణాలలో పారిశుధ్య పనులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిర్వహించాలన్నారు. దోమల లార్వా నివారణకు అవసరమైన క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలన్నారు. నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ వేయటం, వీదుల్లో ఫాగింగ్ చేపట్టడం, గంబుషియా చేపలు నీటిలో విడిచి పెట్టడం తదితర చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు దోమతెరలు వినియోగం, పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, వార్డుల్లో పక్కాగా అమలు జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా విద్యుత్తు కోతలు లేకుండా చూడాలన్నారు. వస్తే గృహాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. కరెంట్ లేకపోవడంతో ఫ్యాన్లు వేసుకోలేక దోమల బారిన ప్రజలు పడుతున్నారన్నారు. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రజలను వేధిస్తున్నాయన్నారు. దోమల నివారణకు తగు చర్యలు చేపట్టి జిల్లా ప్రజలను దోమల బారి నుండి రక్షించాలని కోరారు. అలాగే ప్రజలకు తాగునీరు అందించే తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని కోరారు.