జనసైనికుల పోరాటంతో రోడ్లకు మరమ్మత్తులు

గుడివాడ నియోజకవర్గం: గుడివాడ పట్టణ స్థానిక పెద ఎరుకుపాడు వార్డులో రోడ్లు గుంతలమయంతో ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడడంతో ఆ సమస్యని గుడివాడ పట్టణ జన సైనికులు నిరసన కార్యక్రమం తెలియజేసి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయగా వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయడంతో మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బందికి, వార్డు ప్రజలు తరఫున మరియు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(ఆర్.కె) మాట్లాడుతూ.. గుడివాడ పట్టణ స్థానిక పెద ఎరుకపాడు వార్పు రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గుంతలమయంతో వార్డు ప్రజలు మరియు వాహనదారులు ఇబ్బంది పడడంతో ఆ సమస్యను గుర్తించి నిరసన కార్యక్రమం తెలియజేసి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించి రోడ్డును మరమత్తులు చేయడం జరిగింది.. అదేవిధంగా గుడివాడ పట్నంలో అనేక వార్డుల్లో ఇదే పరిస్థితి ఉందని దయచేసి ఎవరో రావాలి ఏదో చేయాలని కాకుండా మన సమస్యలను మనమే ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తే ఆ సమస్యను లేకుండా చేయవచ్చని తెలియజేశారు ఎవరికి ఎవరు నాకెందుకు నాకెందుకు అనుకుంటే మన గుడివాడ పట్టణ అభివృద్ధి మరుగున పడుతుందని ప్రతివారు సమస్య ప్రభుత్వ అధికారులు తెలియజేసేలా ఉండాలని కోరారు.. సమస్యల మీద పోరాట స్ఫూర్తి నేర్పిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము కార్యకర్తలగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బందికి జనసేన పార్టీ తరఫున, పెద ఎరుకపాడు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, చరణ్ తేజ్, కిరణ్, గంటా అంజి, శివ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.