ఆర్టీసి చార్జీల పెంపుపై సత్యసాయి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం

శ్రీ సత్యసాయి జిల్లా, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలపైన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు తరువాత ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు భారీ మొత్తంలో పెంచుకుంటూ పోతూ ప్రజలపై భారీగా భారం మోపుతున్నారు. ఈ విషయంపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అయిన బసంత్ కుమార్ కి వినతిపత్రాన్ని అందజేసిన పుట్టపర్తి మండల అధ్యక్షులు తలారి పెద్దన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు. రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం ఇలా చార్జీలను పెంచుతూ ప్రజలను అప్పులపాలు చేస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సుల విషయంలో ఇది వరకే రెండు సార్లు చార్జీలను పెంచి ఆర్టీసీ వారు ఇంత వరకూ ప్రజలకు ఎటువంటి ఆధునిక సౌకర్యాలు కలిపించలేదు.. ఇప్పుడు మూడోసారి కూడా అధిక మొత్తంలో చార్జీలను పెంచి ప్రజలకు భారాన్ని మోపుతోంది ఈ ప్రభుత్వం. ఈ మధ్యనే కదిరి నుంచి పుట్టపర్తికి వస్తున్న దార్లో బస్సు కండిషన్ సరిగ్గా లేకపోవడంతో బస్ ప్రమాదానికి గురైంది,ఆ సమయం లో బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని అరికట్టడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బస్సులు కండీషన్లో లేక ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా చార్జీలను పెంచకుండా ప్రజలపై భారాన్ని మోపకుండా చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వాటర్స్ కి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని పుట్టపర్తి జనసేన పార్టీ తరుపున కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డా. తిరుపతేంద్ర, కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, జగరాజు పల్లి నరసింహ, సాయి ప్రభ, మేకల పవన్ కళ్యాణ్, చిగిచేర్ల గణేష్, అభి, నాగేంద్ర, చంద్ర, జగరాజు పల్లి నగేష్, రమేష్, దీపు, శివ, అఖిల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.