అమరావతి రైతుల మహా పాదయాత్రకి మద్ధతు తెలిపిన రేపల్లె జనసేన

రేపల్లె, అమరావతి రైతుల మహా పాదయాత్రకి జనసేన పార్టీ పూర్తి స్థాయి మద్దతులో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో మంగళవరం చివరిరోజు కావున అమరావతి రైతులకు జనసేన పార్టీ తరుపున జిల్లా కార్యదర్శి మత్తి భాస్కరరావు సారథ్యంలో అందుబాటులో ఉన్న జనసైనికులు రైతులకు ఘనంగా స్వాగతం పలికి వారి మహా పాదయాత్రకి మద్దతు తెలిపి వారితో పాటు రేపల్లె అంకమ్మ చెట్టు దగ్గర నుండి పెనుమూడి వారధి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చందోలు ప్రసాద్, పాటు నగరం, చెరుకుపల్లె, రేపల్లె, నిజాంపట్నం మండలం జనసైనికులు పాల్గొన్నారు.