వైసీపీ పార్టీ నుంచి 100 కుటుంబాల ప్రతినిదులు జనసేనలో చేరికలు

చంద్రగిరి నియోజకవర్గం: చంద్రగిరి ఇంఛార్జి దేవర మనోహర ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, సి.కే పల్లి పంచాయతీలోని చిట్టత్తురు గ్రామానికిచెందిన పురుషోత్తం నేతృత్వంలో, మండల అధ్యక్షులు శ్రీ సంజీవి హరి అధ్యక్షతన దాదాపు 100కి పైగా కుటుంబాల ప్రతినిధులు, అధికార వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా దేవర మనోహర మాట్లాడుతూ పల్లెట్టూర్లు, పట్టుగూడ్లని అలాంటి పల్లెటూరులో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఎమ్మేల్యే గా కొనసాగే అర్హతే లేదు, పబ్లిసిటీ మీద పెట్టే శ్రద్ధ ప్రజల కష్టాలపై పెడితే వారి జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని, అలాంటిది చంద్రగిరిలో ఈ చేరికలు చూస్తున్నట్లయితే నియోజకవర్గంలో అభివృద్ధిపై ఆశలు చిగురింపజేస్తున్నయని రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయమని, ప్రతి ఒక్కరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ముందుకు వచ్చి జనసేనతో ప్రయాణించాలని ఈ రాష్ట్ర దశా దిశా మార్చే నాయకుడి వెంట నడవాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో భారీ చేరికలు ఉంటాయని, నియోజకవర్గంలోని ఇతర పార్టీ కీలక నేతలు, ప్రముఖులు చేరుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, యువ నాయకులు పగడాల యువరాజ్ రాయల్, తపసి మురళి రెడ్డి, నూనె దిలీప్, గుర్రప్ప, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.