వైసీపీ గల్లి నాయకుల ఉడత బెదిరింపులకు ఎవరూ అదరరు, బెదరరు

  • రాబోవు ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వంలో అందరి లెక్కలు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ భారతదేశంలో భారతీయుడిగా పుట్టిన ఏ కులం అయినా ఏ మతస్థుడైన సరే జాతీయ జెండాను ఎగరవేసుకునే హక్కు ఉంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామం ఎంట్రన్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటే వైసీపీ నాయకులు బెదిరించి దిమ్మెను కుల్చేస్తామని అనడం ఇది రాజ్యాంగబద్ధమెన వ్యవస్థ ఇంకా ఎక్కడ ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన అనుచరులు సంఘ విద్రోహ శక్తులుగా ప్రవర్తిస్తా ఉంటే చూస్తూ ఊరుకోవాలా జాతీయ జెండాను గౌరవించలేని వాడు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక 50 రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సమిష్టిగా కలిసి ముగింపు పలకడం ఖాయం. రాబోయేది జనసేన, తెలుగుదేశం పార్టీల ప్రజా ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలన్న, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా జనసేన తెలుగుదేశం పార్టీలతోనే సాధ్యం. ప్రజలందరూ ఒక క్షణం ఆలోచించండి ఎవరైతే వైసిపి నాయకులు జాతీయ జెండా ఎగరవేసే దిమ్మిను కూల్చస్తామన్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేంతవరకు మేమైతే ఉపేక్షించం. ఈ కార్యక్రమంలో వీరమహిళ గుమ్మినేని వాణి భవాని, పినిశెట్టి మల్లికార్జున్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి, చెంచయ్య, రామిరెడ్డి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం మస్తాన్, చిన్న మనుబోలు మండల నాయకులు సుబ్రహ్మణ్యం, సుధాకర్, రహమన్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.