తాడేపల్లిగూడెం జనసేన ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు బొలిశెట్టి రాజేష్ అధ్యక్షతనలో జనసేన ఆఫీస్ వద్ద భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు 15న విముక్తి లభించిందనీ, ఇక 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందనీ కనుక ప్రతి ఏడాది అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని అందరికీ తెలుసిన విషయమేనని అప్పటి వరకూ ఉన్న బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం (1935) రద్దు అయి జనవరి 26, 1950 నుంచి భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.