సమాజానికి మీరే గౌరవం – కావాలి మాకు మీ అనుభవం

  • సీనియర్ సిటిజన్స్ గౌరవ కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం గురువారం సిటీ సహాయ కార్యదర్శి వాడ్రేవు లోవరాజు ఆధ్వర్యంలో 23వ డివిజన్ జగన్నాధపురం అన్నమ్మ ఘాటీ సెంటర్ ప్రాంతంలో జరిగింది. సమాజంలో వివిధరకాల వయసులవారు ఉంటారనీ, చిన్న వయసు పిల్లలకు పెద్దవారు తమ అనుభవాల సారాన్ని చెప్పి వారికి మార్గనిర్దేశం చేయడం మన సంస్కృతి ఆన్నారు. సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకోడం మన సాంప్రదాయమన్నారు, ఇందులో భాగంగా నగరంలో చంటమ్మ, పుల్లయ్య, సూరరమ్మ, బర్రె మంగమ్మ, షేక్ అషిన వీరిని కలిసి ఆశీర్వాదాలు తీసుకుని జనసేన పార్టీకి వీరియొక్క సలహాలు, సూచనలను అందించవలసినదిగా కోరారు. సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న అసమానతలను రూపుమాపేందుకు వీరి అనుభవంతో మెరుగైన మార్గాన్ని జనసేన పార్టీకి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అందించవలసినదిగా పోస్టల్ కవర్లను అందచేస్తూ కోరారు. ఈ కార్యక్రమంలో సిటి సహాయ కార్యదర్శి శ్రీరామచంద్ర మూర్తి, జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, చీకట్ల శ్రీనివాస్, ర్యాలి గని, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.