జిల్లా ఎస్పి రవిశంకర్ రెడ్డికి గ్రీవెన్స్ సెల్ లో స్పందన కంప్లైంట్

గుంటూరు, గత రెండు రోజులుగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తర్వాత గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశ్శంకరావు శ్రీనివాసరావు పోలిస్ వేధింపులకు గురి కావడం వలన నేడు పల్నాడు జిల్లా ఎస్పి రవిశంకర్ రెడ్డికి గ్రీవెన్స్ సెల్ లో స్పందన కంప్లైంట్ ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట నాయకులు షేక్ జిలాని, నరసరావుపేట పట్టణ అధ్యక్షులు జి.వి.యస్ ప్రసాద్ గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమ్మినాయుడు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీనక్కా రమణరావు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వెలిదండి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బండ్ల గోపి, లీగల్ సెల్ మెంబర్ మారేళ్ళ సీతారామయ్య, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.